HomeTelugu Big Storiesలాక్‌డౌన్‌ కారణంగా అమితాబ్ ఇంట్లో స్టార్‌ హీరోలు.. వీడియో వైరల్

లాక్‌డౌన్‌ కారణంగా అమితాబ్ ఇంట్లో స్టార్‌ హీరోలు.. వీడియో వైరల్

3 7

కరోనాపై అశేష భారతావని పోరు సాగించేందుకు భారతీయ చిత్ర పరిశ్రమ నుంచి విరాళాలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌, మాలీవుడ్‌ అనే తారతమ్యం లేకుండా హీరోలు, హీరోయిన్లు, దర్శక, నిర్మాతలు ఉదారంగా సాయమందిస్తూ తమ గొప్ప మనసును చాటుకుంటున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా దేశవ్యాప్తంగా థియేటర్లు మూసేశారు. దీంతో సినిమా ప్రేక్షకులంతా తమ అభిమాన తారల్ని పెద్ద తెరపై చూసే వీలులేకుండా పోయింది. అందుకే అటు అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఉత్సాహం నింపుతూ, ఇటు కార్మికులు, దినసరి కూలీలకు చేతనైన సాయమందించేందుకు ‘ఫ్యామిలీ’ అనే షార్ట్‌ఫిల్మ్‌లో నటించారు దేశంలోని దిగ్గజ తారాగణం.

కరోనాను అరికట్టడానికి దేశంలో సూపర్ స్టార్స్ అందరూ ఒకే వేదికపైకి వచ్చారు. ఈ లాక్‌డౌన్ సమయంలో కావడంలో అందరూ ఒకేచోటకు రాకుండా.. కరోనా కట్టడి చేసేందుకు తమలాగే అందరూ ఇళ్లకే పరిమితం కావాలనే సందేశమిస్తూ ‘ఫ్యామిలీ’ అనే షార్ట్‌ ఫిలింలో విడివిడిగా ఉంటూనే కలిసి నటించిన ఫీలింగ్ క్రియేట్ చేశారు. ఈ కాన్సెప్ట్ డిఫరెంట్‌గా ఉడటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అమితాబ్ బచ్చన్ సలహా సూచన మేరకు సోనీ నెట్‌వర్క్ షార్ట్ ఫిలిం రూపొందించింది. అమితాబ్ తన ఇంట్లో ఉంటూ కూలింగ్ గ్లాసెస్ వెతుకుతూ ఉంటారు. అవి ఎక్కడ ఉన్నాయో రణ్‌వీర్, దిల్జీత్ దోసంజ్ ఇల్లంతా కలియతిరుగుతారు. ఈ క్రమంలో చిరంజీవి, రజనీకాంత్, మోహన్‌లాల్, మమ్ముట్టి, శివరాజ్‌కుమార్‌ను కూలింగ్ గ్లాసెస్ గురించి ఆరా తీస్తారు. చివరకు కూలింగ్ గ్లాసెస్‌ను ప్రియాంక చోప్రా తీసుకెళ్లి అమితాబ్‌కు ఇవ్వడంతో కథ ముగుస్తుంది.

షార్ట్ పిలిం చివర్లో ఇది ఎందుకు తీయాల్సి వచ్చిందో అమితాబ్ వివరించారు. లాక్‌డౌన్ సందర్భంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న సినీ కార్మికులు, దినసరి కూలీలకు నిధులు సమకూర్చడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ షార్ట్ ఫిలింలో నటించిన వారంతా ఇళ్లకే పరిమితమయ్యారని చెప్పారు. ఎవరూ భయపడొద్దని, ఇళ్లకే పరిమితమైతే మహమ్మారి తొలగిపోతుందని అన్నారు. షార్ట్‌ ఫిలింలో రజనీకాంత్ తనదైన స్టైల్లో స్పెక్ట్స్ తిప్పిన తీరు బాత్‌రూంలోకి నీళ్లే రావడం లేదు, కళ్లజోడు ఏం వస్తుందని చిరంజీవి వెటకారం, రణ్‌వీర్, దిల్జీత్, అలియా భట్ చేసిన సందడి బాగుంది. ఇంతమంది సూపర్ స్టార్స్ నటించిన ఈ షార్ట్ ఫిలింను ప్రముఖ యాడ్ డైరెక్టర్ ప్రసూన్ పాండే డైరెక్ట్ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu