‘మెర్సల్’ లెక్కలు ఫేక్ అంట!

విజయ్ నటించిన ‘మెర్సల్’ సినిమా ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాను వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇప్పుడు మరో వివాదంలో మెర్సల్ సినిమా ఇరుక్కుంది. ఈ సినిమా గురించి ఓ తమిళ డిస్ట్రిబ్యూటర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ‘మెర్సల్’ సినిమా వసూళ్లపై ఆయన మాట్లాడుతూ.. ‘అవన్నీ ఫేక్ లెక్కలని తేల్చేశాడు’.

చెన్నైలో ఒక థియేటర్ ను కలిగిన ఈ డిస్ట్రిబ్యూటర్ అభిరామి రామనాథన్ మెర్సల్ భారీ వసూళ్ల లెక్కలపై స్పందించాడు. ఆ సినిమా రెండు వందల కోట్లు సాధించిందని రోబో రికార్డ్స్ ను తిరగరాసిందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని అన్నారు. జనాలను ఆకర్షించడానికి మాత్రమే ఈ నంబర్లు చెబుతున్నారని వ్యాఖ్యానించారు.

‘థియేటర్ వద్ద మేము కావాలని కొందరితో బ్లాక్ టికెట్లు అమ్మిస్తాం. దాని వల్ల సినిమాకు డిమాండ్ ఉందని సినిమా బాగుందని ప్రేక్షకులు అనుకోవడానికే ఆ పని చేయిస్తాం. ఇప్పుడు అలాంటి వ్యూహంతోనే పెద్ద నంబర్లు చెబుతున్నారని’ అన్నారు.