మిర్చి లవ్ ప్రారంభోత్సవంలో దేవిశ్రీ ప్రసాద్!

తన పాటలకు, శ్రోతలకు మధ్య వారధిలా రేడియో మిర్చి ఎఫ్‌ఎమ్ స్టేషన్ నిలుస్తుందని.. తన పాటలకు శ్రోతల నుంచి  వచ్చే స్పందనను రేడియోమిర్చి ద్వారా తెలుసుకుంటానని అన్నారు ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్. ప్రముఖ ఎఫ్‌ఎమ్ స్టేషన్ రేడియో మిర్చి నుంచి  మిర్చి లవ్ 104 ఎఫ్‌ఎమ్ పేరిట స్థాపించిన కొత్త రేడియో  స్టేషన్‌ను ఆదివారం సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేడియో మిర్చితో తన అనుబంధం ప్రత్యేకమైనది.  ఈ సంస్థ నుంచి వస్తున్న ఈ కొత్త ఎఫ్‌ఎమ్ కూడా విజయవంతం కావాలి. సాధారణంగా ఎంతో ఒత్తిడిలో వున్న ప్రేమగీతాలు వినగానే మనం రిలాక్స్ అవుతుంటాం. ప్రేమపాటలు మనల్ని సుదూర తీరాలకు తీసుకవెళ్తాయి. సో.. ఎప్పుడూ ప్రేమగీతాలనే వినిపించే మిర్చి లవ్ 104 ఎఫ్‌ఎమ్ యువతనే కాకుండా అందరి మనసులను గెలుచుకుంటుందనే నమ్మకం వుంది అని అన్నారు. ఈ సమావేశంలో రేడియో మిర్చి స్టేషన్ హెడ్ అరింధం, ప్రొగామింగ్ హెడ్ సాయి, ఆర్‌జే హేమంత్ తదితరులు పాల్గొన్నారు.