మొదటిసారి బన్నీ డ్యూయల్ రోల్!

టాలీవుడ్ హీరోలు తమ మార్కెట్ ను పెంచుకోవడానికి తమ చిత్రాలను తమిళంలో కూడా రిలీజ్
చేస్తుంటారు. కొందరు హీరోలు డైరెక్ట్ గా తమిళ చిత్రాల్లోనే నటిస్తున్నారు. అల్లు అర్జున్ కూడా ఈ
ఛాన్స్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. ఎట్టకేలకు లింగుస్వామి డైరెక్షన్ లో తెలుగు,
తమిళ బాషల్లో ఓ సినిమాలో నటించడానికి అంగీకరించాడు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన
వివరాలను వెల్లడించడానికి చెన్నైలో ఓ ప్రెస్ మీట్ ను నిర్వహించారు. అయితే ఇప్పుడు ఈ
సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాలో బన్నీ డ్యూయల్
రోల్ లో కనిపించబోతున్నాడనేది ఆ వార్తల సారాంశం. అంతేకాదు ఓ పాత్రలో ఆయన నెగెటివ్
షేడ్స్ లో కనిపించనున్నాడని చెబుతున్నారు. ఇదే గనుక నిజమైతే బన్నీ కెరీర్ లో ఇదొక
వైవిధ్యభరితమైన చిత్రంగా నిలవడం ఖాయం. త్వరలోనే ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకువెళ్లడానికి
సన్నాహాలు చేస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates