HomeTelugu Trending'ఉప్పెన' డైరెక్టర్‌తో మోక్షజ్ఞ ఎంట్రీ!

‘ఉప్పెన’ డైరెక్టర్‌తో మోక్షజ్ఞ ఎంట్రీ!

Mokshagna movie with buchi

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ టాలీవుడ్‌ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. అయితే మోక్షజ్ఞ ఎవరి డైరెక్షన్‌లో అరంగేట్రం చేయనున్నడు అనేది క్లారిటీ రాలేదు. మరోసారి మోక్షజ్ఞ ఎంట్రీ విషయం తెరపైకి వచ్చింది. ‘ఆదిత్య 369’ సినిమా సీక్వెల్ ద్వారా మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందనే మాట ఇటీవల వినిపించింది. ఈ సినిమాలో బాలకృష్ణతో పాటు మోక్షజ్ఞ కనిపిస్తాడని చెప్పుకున్నారు. కానీ మోక్షజ్ఞ ఒక కొత్త కథ ద్వారా సోలోగానే తెలుగు తెరకి పరిచయం కానున్నాడనేది తాజాగా వినిపిస్తోన్న వార్త. మోక్షజ్ఞతో ఒక స్టార్ డైరెక్టర్ సినిమాను ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు.

అలాగే, మోక్షజ్ఞతో సినిమా చేయడానికి మైత్రీ మూవీ మేకర్స్ వారు కూడా రంగంలోకి దిగారని అంటున్నారు. ‘ఉప్పెన’ సినిమాతో తమకి భారీ హిట్ ఇచ్చిన బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ సినిమా ఉండనుందని అంటున్నారు. ఆల్రెడీ ఈ నిర్మాతలు బాలకృష్ణను కలవడం జరిగిపోయిందని చెప్పుకుంటున్నారు. వచ్చే ఏడాదిలో మోక్షజ్ఞ పరిచయం కావడం ఖాయమని తెలుస్తోంది.దినిలో నిజం ఎంతుందో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!