డ్రగ్స్ వివాదంలో మరొక సంచలనం!

టాలీవుడ్ లో డ్రగ్స్ వివాదం సంచలనంగా మారింది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలకు నోటీసులు అందాయి. రోజుకొకరు చొప్పున సిట్ అధికారులు వారిని విచారణ కూడా జరుపుతున్నారు. అయితే ఈరోజు ఇండస్ట్రీకు మరొక భారీ షాక్ తగలనుందని టాక్. అందుతున్న సమాచారం ప్రకారం ఓ నలుగురు సినీప్రముఖులకు నోటీసులు అందబోతున్నాయని తెలుస్తోంది.

మంచి ఊపు మీదున్న ఓ యంగ్ హీరోకు, అలానే కుటుంబ కథలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే మరో హీరోకు, ఇండస్ట్రీలో ఉన్న ఓ టాప్ హీరోయిన్ కు, ఓ అగ్ర తారకు డ్రగ్స్ వివాదానికి సంబంధించి లింకులు ఉన్నాయనే సమాచారంతో సిట్ అధికారులు వారిని కూడా విచారించడానికి రెడీ అవుతున్నారనేది తాజా సమాచారం. మరి ఈ వివాదానికి తెర ఎప్పుడు దింపుతారో.. చూడాలి!