సర్జికల్ స్ట్రైక్స్ ను ప్రశంసించిన సినీ ప్రముఖులు

పుల్వామా దాడికి ప్రతీకగా భారత వాయు సేన సంస్థ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలపై ఈ తెల్లవారు జామున ఎయిర్ స్ట్రైక్స్ ను నిర్వహించింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన 12 మిరాజ్ 200 యుద్ధ విమానాలు ఈ దాడులు చేశాయి. తెల్లవారు జామున 3:31 గంటల సమయంలో ఈ దాడులు జరిగాయి. 21 నిమిషాలపాటు జరిగిన ఈ దాడిలో మూడు ఉగ్రవాద శిబిరాలు పూర్తిగా ద్వంసం అయ్యాయి. దాదాపు 300 మంది ఉగ్రవాదులు మరించినట్టు సమాచారం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్వహించిన ఈ సర్జికల్ స్ట్రైక్స్ ను పలువురు ప్రముఖులు ప్రశంసించారు.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైలెట్స్ సాహసోపేతమైన దాడులు చేశారని, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు దేశం తరపున సెల్యూట్ చేస్తున్నట్టు అక్షయ్ కుమార్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ ఎటాక్ ఇంతటితో ఆగాలని, యుద్ధం కోరుకోవడం లేదని సమంత ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు సెల్యూట్ చేస్తున్నట్టు అఖిల్ తెలిపారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అసాధ్యాన్ని సైతం చేసి చూపిస్తుందని అన్నారు.

12 యుద్ధ విమానాలకు ఎలాంటి నష్టం జరగకుండా స్ట్రైక్స్ నిర్వహించిన ఫైలెట్స్ కు సెల్యూట్ చేస్తున్నట్టు కమల్ హాసన్ ట్వీట్ చేశారు. వరుణ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్ తదితరులు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైలెట్స్ కు సెల్యూట్ చేశారు.

 

CLICK HERE!! For the aha Latest Updates