‘మిస్టర్ మజ్ను’ టైటిల్ సాంగ్ వీడియో లో చరణ్ స్పెషల్ ఎట్రాక్షన్..!

యంగ్‌ హీరో అఖిల్ నటిస్తున్న సినిమా ‘మిస్టర్ మజ్ను’ సెకండ్ సింగిల్ టైటిల్ సాంగ్ ఈరోజు విడుదల అయింది. సాయంత్రం 6 గంటలకు రిలీజ్ కావాల్సిన ఈ సెకండ్ సింగిల్.. కాస్త ఆలస్యంగా రిలీజ్ అయింది. క్లాసిక్ లో మాస్ ను మిక్స్ చేసిన ఈ సాంగ్ ట్యూన్ పరంగా ఆకట్టుకుంది. అఖిల్ సిక్స్ ప్యాక్ బాడీతో పాటు.. హ్యాండ్ సమ్ గా కనిపించారు. సాంగ్ ను విదేశాల్లో షూట్ చేసినట్టు రష్ లో కనిపిస్తుంది.

అఖిల్ సింపుల్ గా ఉండే స్టెప్స్ తో పాటు.. చుట్టూ అమ్మాయిలతో కలిసి చేసే డ్యాన్స్ చూస్తే.. నాగార్జున సినిమాలు గుర్తుకు వస్తాయి. ఈ సింగిల్ లో రామ్ చరణ్ కనిపించడం స్పెషల్ ఎట్రాక్షన్ గా మారింది. సాంగ్ షూట్ సమయంలో లొకేషన్ కు వెళ్లిన చరణ్.. రష్ ను చూసి అభినందిస్తున్నట్టు వీడియోలో కనిపిస్తుంది. ఈ సినిమాకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. నిధి అగర్వాల్‌ హీరోయిన్‌. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. తమన్‌ బాణీలు సంగీతం అందిస్తున్నారు. జనవరి 25న ఈ సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.