HomeTelugu Trendingఅల్లు అర్జున్‌, సుకుమార్‌ టైటిల్‌పై క్లారిటీ..

అల్లు అర్జున్‌, సుకుమార్‌ టైటిల్‌పై క్లారిటీ..

 

8 17

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌.. సుకుమార్‌ హ్యాట్రిక్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్‌ కథాంశంతో ఓ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతున్నట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి‌. అయితే ఈ సినిమా టైటిల్‌ గురించి ఎన్నో పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ‘శేషాచలం’ అనే టైటిల్‌ను చిత్రబృందం ఖరారు చేయబోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ సినిమా టైటిల్‌ గురించి ఓ ట్వీట్‌ పెట్టింది. బన్నీ సినిమా టైటిల్‌ గురించి వస్తోన్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది.

‘అల్లుఅర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో AA20 వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతోన్న సినిమాకు ఇంకా పేరు ఖరారు చేయలేదు. కొన్ని వెబ్‌సైట్లలో సినిమా టైటిల్‌ గురించి వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. సరైన సమయంలో తప్పకుండా మేము టైటిల్‌ను ప్రకటిస్తాం. ధన్యవాదాలు.’ అని మైత్రి మూవీ మేకర్స్‌ పేర్కొంది. ఈ చిత్రంలో బన్నీకి జంటగా రష్మిక కనిపించనున్నారు. మరోవైపు బుల్లితెర వ్యాఖ్యాత, నటి అనసూయ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రను పోషించనున్నారు.

8a 1

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!