HomeTelugu Newsమైత్రీ మేకర్స్ తో చిరంజీవి సినిమా!

మైత్రీ మేకర్స్ తో చిరంజీవి సినిమా!

Mythri movie makers to prodమెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తరువాత వరుస సినిమాలు చేయడానికి సమాయత్తమవుతున్నారు. ఒకదాని తర్వాత మరొక చిత్రాన్ని సెట్స్ కి తీసుకువెళ్లేలా ఆయన ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం చేస్తున్న ‘ఆచార్య’ ఆయన తర్వాత డైరెక్టర్‌ బాబీతో ఓ సినిమా సెట్స్ కిపై వెళ్లడానికి ఎక్కువ ఆస్కారం వుంది. ఇప్పటికే బాబీ రూపొందించిన కథకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. దీంతో పూర్తి స్క్రిప్టుకి తుది మెరుగులు దిద్దే పనిలో దర్శకుడు బాబీ ఉన్నాడు.

మరోపక్క ఈ చిత్రాన్ని ఎవరు నిర్మిస్తారన్న విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాకపోయినప్పటికీ, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ దీనిని నిర్మించడానికి ఎక్కువ అవకాశాలు వున్నాయని తెలుస్తోంది. ఈ ప్రాజక్ట్‌కు ఈ సంస్థను బాబీ బాగా సిఫార్సు చేస్తున్నాడట. అయితే, ఈ చిత్ర నిర్మాణంలో మైత్రీ మూవీ మేకర్స్ తో పాటు మరో నిర్మాతను కూడా భాగస్వామ్యం చేసేలా చిరంజీవి యోచిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే నిర్మాతల విషయంలో ఒక క్లారిటీ వస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu