మెగా బ్రదర్‌ను ట్రోల్‌ చేస్తున్న నెటిజన్లు.. టార్గెట్ నిహారిక

మెగా బ్రదర్ నాగబాబు గత కొన్నాళ్లుగా సినిమాలు పెద్దగా లేకపోవడంతో తన దృష్టిని సోషల్ మీడియాపై పెట్టారు. ఇటీవల బాలయ్యపై పలు వివాదాస్పద కామెంట్స్ చేసి నందమూరి అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. ఆ తరువాత జగన్, చంద్రబాబు, లోకేష్‌లపై ‘అంతా నా ఇష్టం’ అంటూ తన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ అయ్యారు. ఇవన్నీ తమ్ముడు పవన్ కళ్యాణ్‌ రాజకీయ ఎదుగుదలకు ఉపకరిస్తాయని నాగబాబు భావించినా.. ఆయన కామెంట్స్ వల్ల పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని రాజకీయ విశ్లేషకుల భావన.

ఇక పొలిటికల్ సెటైర్స్ నుండి రూటు మార్చిన నాగబాబు.. తాజాగా ప్రముఖ సింగర్‌ ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంపై వివాదాస్పద వ్యాఖ్యలతో హాట్ టాపిక్‌గా మారారు. తాజాగా విడుదలు చేసిన వీడియోలో బాలసుబ్రహ్మణ్యాన్ని ఇన్ డైరెక్ట్‌గా ఎత్తిపొడుస్తూ నెటిజన్ల ఆగ్రహానికి గురౌతున్నారు నాగబాబు.

కాగా ఇటీవల గానగాంధర్వుడు ఎస్. పి బాలసుబ్రహ్మణ్యం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ హీరోయిన్స్ వస్త్రధారణపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సినిమా ఫంక్షన్లకు వచ్చే హీరోయిన్లు వేదికపైకి ఎలాంటి డ్రెస్‌లు వేసుకుని రావాలో తెలియదా.. అంగాంగ ప్రదర్శన చేస్తేనే ఆఫర్లు వస్తాయని ఇలా చేయడం తగదని.. భారతీయ విలువలు, సాంప్రదాయాలకు లోబడే మనం ప్రవర్తించాలని అందాలు ఆరబోసే హీరోయిన్స్‌కి చురకలు అంటించారు.

ఈ అంశం పై నాగబాబు స్పందిస్తూ.. అసలు ఆడవాళ్ల డ్రెస్ గురించి మాట్లాడే అధికారం మీకు ఎవరు ఇచ్చారు. సాంప్రదాయం, మతం ముసుగులో కూర్చుని ఆడపిల్లలు ఇలాంటి డ్రెస్‌లు వేసుకోకూడదని చెప్తారా.. అలాంటి డ్రెస్‌ల వల్ల మగవాళ్ల కోరికలు పెరుగుతున్నాయి అంటారా.. మగవాడి కామదృష్టికి నీచమైన ఆలోచనకి శరీరాన్ని కప్పుకున్నా.. ఎక్స్‌పోజ్ చేసినా వాడి బుద్ది మారదు. అలాంటి వాళ్లకోసం మీరు డిక్టేట్ చేస్తారా?

పలానా హీరోయిన్ పొట్టి డ్రెస్ వేసుకుంది. క్యారెక్టర్ కోసం ఎట్రాక్ట్ చేస్తుంది అంటూ కామెంట్ చేస్తున్నారే.. అసలు మీ దృష్టి వాళ్ల డ్రెస్ మీదికి ఎందుకు వెళ్తుంది. మీ కళ్లు ఆమె డ్రెస్‌‌ని ఎందుకు చూస్తున్నాయ్. ఆ అమ్మాయి తొడలు కనిపిస్తున్నాయ్.. బొడ్డు కనిపిస్తుంది.. ఈ దృష్టి మీకు ఎందుకు వచ్చింది. ఏ మీరు చూడకుండా ఉండలేరా? ఫస్ట్ మీ వక్రబుద్ధి మార్చుకోండి. మీరు చూసే చూపు ఉంటుందే ఆ నీచమైన చూపునుండి బయటపడండి. మీరు చూసేదంతా చూసేసి చప్పలించేస్తారు. తరువాత స్టేజ్‌ల మీదికొచ్చి కబుర్లు చెప్తారు. ఆపండి సార్.. వాళ్లు నిజంగా ఒళ్లంతా విప్పుకుని రోడ్లుమీద తిరిగితే చట్టాలు ఉన్నాయి. వాళ్లు కూడా మగాళ్ల వస్త్రధారణపై కండిషన్ పెట్టి రోడ్డు ఎక్కితే దూలతీరిపోద్ది మీకు’ అంటూ ఓ రేంజ్‌లో నాగబాబు ఫైర్ అయ్యారు.

ఇక నాగబాబు కామెంట్స్‌పై నెటిజన్లు ఓ రేంజ్‌లో మండిపడుతూ.. మంచి బట్టలేసుకోమనడం కూడా తప్పేనా అంటూ రివర్స్‌లో నాగబాబు పర్శనల్ లైఫ్ విషయాలను నెట్‌లో పెట్టేస్తున్నారు. ముఖ్యంగా నాగబాబు కూతురు నిహారికను ఈ వివాదంలోకి లాగుతూ ఆమెపై అసభ్యకరమైన పద్ధతిలో కామెంట్స్‌ చేస్తున్నారు. ఆమెతో పాటు మెగాస్టార్ చిరంజీవి కూతుళ్లను కూడా ఈ వివాదంలోకి లాగుతున్నారు. వస్త్రధారణ విషయంలో జాగ్రత్తగా ఉండాలని.. భారతీయ సాంప్రదాయాన్ని కాపాడాలంటూ కోరిన బాలసుబ్రహ్మణ్యం మాటల్లో తప్పేం ఉందంటూ నాగబాబుని ట్రోల్ చేస్తున్నారు. ఈ విషయంలో అటు బాలసుబ్రహ్మణ్యాన్ని సమర్ధించే వారు కొందరైతే.. ఇటు నాగబాబుని సమర్ధించే వారు లేకపోలేదు.