గౌతమ్ మీనన్ సినిమా నుండి చైతు వాకౌట్!

తనకు కెరీర్ ఆరంభంలో ‘ఏ మాయ చేసావే’ వంటి సక్సెస్ ను ఇచ్చిన గౌతమ్ మీనన్ సినిమా నుండి నాగచైతన్య తప్పుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అసలు విషయంలోకి వస్తే.. గౌతమ్ మీనన్ నిర్మాణంలో ‘నాగర్ సూరన్’ అనే త్రిల్లర్ సినిమాలో చైతు నటిస్తున్నట్లుగా గతంలో వార్తలు వచ్చాయి. ఈ చిత్రాన్ని కార్తీక్ నరేన్ అనే దర్శకుడు రూపొందించనున్నాడు. ఈ సినిమాలో చైతుతో పాటు అరవింద్ స్వామి మరో కీలక పాత్రలో నటించనున్నారంటూ.. ప్రచారం జరిగింది. అయితే ఈ సినిమా నుండి చైతు తప్పుకున్నట్లుగా తెలుస్తోంది.
దీనికి కారణం ఏంటనేది తెలియడం లేదు గానీ చైతు అయితే ఈ సినిమా చేయడానికి రెడీగా లేడని మాత్రం తెలుస్తోంది. దీంతో చైతు స్థానంలో ఇంద్రజిత్ సుకుమారన్ ను ఎంపిక చేశారు. ఇటీవల వరుస సక్సెస్ లను అందుకుంటున్న చైతు ప్రస్తుతం ‘రా రండోయ్ వేడుక చూద్దాం’ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. అలానే కొత్త దర్శకుడు కృష్ణతో, చందు మొండేటితో రెండు సినిమాలు సెట్స్ పైకి తీసుకువెళ్లనున్నాడు.