HomeTelugu Trendingతండ్రిబాటలోనే తనయుడు.. నాగ చైతన్య కూడా స్టార్ట్‌ చేసేశాడుగా..

తండ్రిబాటలోనే తనయుడు.. నాగ చైతన్య కూడా స్టార్ట్‌ చేసేశాడుగా..

3 25
అక్కినేని యంగ్‌ హీరో నాగ చైతన్య ప్రస్తుతం శేఖర్ కముల దర్శకత్వంలో ‘లవ్‌స్టోరీ’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత పరశురాంతో ఒక సినిమా చేయనున్నాడు. ‘మజిలీ’ తరువాత ఈ హీరో తన పంథా మార్చుకున్నాడు. తన సినిమా విషయంలో ఆచి తూచి కథలను ఎంచుకుంటున్నాడు. అక్కినేని వారసుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ హీరో త్వరలో ఒక కొత్త బిజినెస్ మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తుంది.

నాగ చైతన్య సొంతంగా ఒక ప్రొడక్షన్ హౌస్ ను నిర్మించనున్నాడు. కొత్త టాలెంట్ ను కొత్త కాన్సెప్టు చిత్రాలను ఎంకరేజ్ చేసే విధంగా… సినిమాలు నిర్మించాలనే ఉద్దేశంతో అక్కినేని నాగ చైతన్య సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మహేష్ , రామ్ చరణ్, నితిన్ , నాగశౌర్య లాంటి హీరోలు సొంత బ్యానర్స్ ను నిర్మించుకున్న విషయం తెలిసిందే. ఇక నాగార్జున కూడా నిర్మాతగా పలు సినిమాలను నిర్మించారు. మనం ఎంటర్ప్రైజెస్ బ్యానర్ ద్వారా పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పుడు చైతన్య కూడా తండ్రిబాటలోనే నడుస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!