‘థ్యాంక్యూ’ విడుదలపై క్లారిటీ ఇచ్చిన మేకర్స్‌

అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న చిత్రం ‘థ్యాంక్యూ’. విక్రమ్‌ కె.కుమార్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా విడుదలపై గత కొన్నిరోజుల నుంచి సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రాన్ని ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ వేదికగా విడుదల చేయనున్నారని అందరూ చెప్పుకొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ వార్తలన్నింటికీ చెక్‌ పెడుతూ చిత్రబృందం బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ఈ సినిమాని థియేటర్‌లోనే విడుదల చేయనున్నామని తెలిపింది. “థ్యాంక్యూ సినిమా నిర్మాణం చివరి దశలో ఉంది. వెండితెరపైనే మా చిత్రాన్ని చూపించాలని అంకితభావంతో దీన్ని నిర్మిస్తున్నాం. సరైన సమయంలో థ్యాంక్యూ చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేస్తాం” అని చిత్రబృందం ప్రకటించింది. విభిన్నమైన ప్రేమకథా చిత్రంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇందులో చైతన్యకు జంటగా రాశీఖన్నా సందడి చేయనున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates