పవన్ కోసం చరణ్ డ్రాప్!

రామ్ చరణ్ నటిస్తోన్న ‘రంగస్థలం’ సినిమా షూటింగ్ డిసంబర్ నాటికి పూర్తవుతుందని తెలుస్తోంది. కాబట్టి సంక్రాంతికి సినిమా విడుదలవుతుందని అందరూ అనుకున్నారు. చిత్రబృందం కూడా సంక్రాంతికి విడుదల అని గతంలో ప్రకటించారు. అయితే ఇప్పుడు సినిమా సంక్రాంతి రేసు నుండి తప్పుకుందని తెలుస్తోంది. నిజానికి సంక్రాంతికి రిలీజ్ చేయడం పెద్ద విషయమేమీ కాదు.

కానీ సంక్రాంతి నాటికి పవన్ కల్యాణ్ ‘అజ్ఞాతవాసి’ రిలీజ్ కానుండడంతో ‘రంగస్థలం’ సినిమాను మార్చికి షిఫ్ట్ చేసినట్లు తెలుస్తోంది. తన బాబాయ్ తో పోటీకి దిగడం ఇష్టం లేని చరణ్ కావాలనే వాయిదా వేయించినట్లు తెలుస్తోంది. సినిమా రిలీజ్ కు చాలా టైమ్ ఉండడంతో ‘రంగస్థలం’ చిత్రయూనిట్ ఇంకాస్త బెటర్ అవుట్ పుట్ ను ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు.