ప్రభాస్ బాలీవుడ్ సినిమాలు..?

‘బాహుబలి 2’ భారీ విజయంతో ప్రభాస్ ఆనందంతో పొంగిపోతున్నాడు ప్రభాస్. ఈ సినిమా తరువాత సుజీత్ దర్శకత్వంలో ఒకటి .. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఒకటి చేయనున్నాడు. ఇక హిందీలోను రెండు సినిమాలు చేయడానికి ఆయన సిద్ధమవుతున్నాడనేది తాజా సమాచారం. బాహుబలి సినిమా సక్సెస్ లో కీలకపాత్ర పోషించిన కరణ్ జోహర్, ప్రభాస్ తో స్ట్రెయిట్ హిందీ సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు.

ఒకేసారి రెండు సినిమాల కోసం ప్రభాస్ తో అగ్రిమెంట్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఈ మేరకు ప్రభాస్ తో చర్చలు కూడా జరిపాడని అంటున్నారు. ప్రభాస్ విదేశాల నుండి తిరిగి వచ్చిన వెంటనే చర్చించి నిర్ణయం తీసుకోనున్నాడు. ఇటీవల ప్రభాస్ మాట్లాడుతూ .. త్వరలో తాను హిందీ సినిమా చేసే అవకాశం ఉందని చెప్పడంతో ఈ కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.