HomeTelugu Trendingజిమ్‌లో 8ప్యాక్‌ బాడీతో నాగశౌర్య.. ఫొటో వైరల్‌

జిమ్‌లో 8ప్యాక్‌ బాడీతో నాగశౌర్య.. ఫొటో వైరల్‌

Naga shaurya in gym with 8

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగశౌర్య వైవిధ్యభరితమైన కథలను ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇటీవలే హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ అనౌన్స్‌ చేసిన మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ 2020లో నాగశౌర్య 5వ స్థానాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ యంగ్‌ హీరో జిమ్‌ వర్కవుట్‌ ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవుతోంది. ఇందులో నాగ శౌర్య మాచో రిప్డ్‌ లుక్‌లో కండలు తిరిగిన దేహదారుఢ్యంతో కనిపిస్తున్నాడు.

ఈ హీరో ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. కెరీర్లో 20వ సినిమా అయిన ‘లక్ష్య’ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాడు. ఈ సినిమాకోసం హీరో ఎన్నడూ లేనివిధంగా 8 ప్యాక్‌ బాడీతో సర్ప్రైజ్ చేశాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రస్తుతం చివరి దశకు చేరుకుందట. ఇప్పటికే టీజర్ తో ఈ సినిమా పై అంచనాలు ఏర్పాడ్డాయి. ప్రస్తుతం ఈ యంగ్‌ హీరో లక్ష్య తో పాటు వరుడు కావలెను, ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమాలతో బీజీగా ఉన్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu