ఎవరు అడ్డుకుంటారో చూస్తాం: నాగబాబు


అమరావతిలో అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన కేసులో అరెస్టయిన మహిళలు, రైతులను పరామర్శించే హక్కు మాకు ఉంది అంటూ జనసేన నాయకుడు నాగబాబు అన్నారు. రైతులను పరామర్శించేందుకు వెళ్లిన తమను పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయం వద్ద మీడియాతో నాగబాబు మాట్లాడారు. రాజధాని ప్రాంతంలోని ఎర్రబాలెం వరకు వెళ్లి బాధిత మహిళలు, రైతులకు తమ సానుభూతి.. నైతిక మద్దతు తెలుపుతామన్నారు. రాజధాని విషయంలో స్థిరమైన నిర్ణయం తీసుకున్నామని.. దానికి కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ఎర్రబాలెం వరకు తప్పకుండా వెళ్తామని.. ఎవరు అడ్డుకుంటారో చూస్తామని నాగబాబు వ్యాఖ్యానించారు. రాజధాని రైతులకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు.