HomeTelugu Trendingవిష్ణు తెలుగు పరీక్షలు రాస్తే పాస్‌ మార్కులు కూడా రావు: నాగబాబు

విష్ణు తెలుగు పరీక్షలు రాస్తే పాస్‌ మార్కులు కూడా రావు: నాగబాబు

Nagababu comments on maa el

మా ఎన్నికలు ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారాయి. రేపు (అక్టోబర్‌ 10) ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రకాష్‌రాజ్, మంచు విష్ణు ప్యానళ్ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే, తాజాగా మా ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు మెగా బ్రదర్‌ నాగబాబు. దేశ ప్రధానితో పోరాటం తెలిసిన వ్యక్తి ప్రకాశ్ రాజ్ అని. ప్రకాశ్ రాజ్ కు ఉన్న ప్రత్యేకతలు విష్ణులో లేవన్నారు. ప్రకాశ్ రాజ్ తో పోల్చాలంటే మోహన్ బాబును పోల్చాలని ఆయన సూచించారు. విద్యార్థులకు ఏం కావాలో విద్యాసంస్థ నడుపుతున్న మోహన్ బాబుకు తెలుసు, నటీనటులకు ఏం కావాలో ఆఫీసుల చుట్టూ తిరిగిన ప్రకాశ్ రాజ్ కే తెలుసని కామెంట్ చేశారు.

ఇక, నిర్మాతలతో వివాదం ప్రకాశ్ రాజ్ కే కాదు మోహన్ బాబు కుటుంబానికి కూడా ఉన్నాయని విమర్శించారు నాగబాబు. సలీం చిత్రం విషయంలో డైరెక్టర్ వైవీఎస్ చౌదరినే మోహన్ బాబు అదోగతి పట్టించారని ఆరోపించారు. మోహన్ బాబుకు ఎదురు తిరగలేక ఎంతో మంది వెనుతిరిగారని కామెంట్ చేసిన ఆయన.. మీ వివాదాల్లో తప్పెవరిదో మాకు తెలియదు, ప్రకాశ్ రాజ్ వివాదాల్లో తప్పెవరిదో మీకు తెలియదని వ్యాఖ్యానించారు. ఇక, విష్ణు నువ్వు ఎక్కడ పుట్టావు, ఎక్కడ చదువుకున్నావు అని ప్రశ్నించారు. మంచు విష్ణు మీ అమ్మానాన్నలు మాత్రమే తెలుగువాళ్లు అని కామెంట్ చేసిన నాగబాబు. ప్రకాశ్ రాజ్, విష్ణు తెలుగు పరీక్ష రాస్తే విష్ణుకు పాస్ మార్కులు కూడా రావు అంటూ సంచలన విమర్శలు చేశారు. ప్రకాశ్ రాజ్ ని తెలుగోడంటారు, విష్ణును తెలుగు నేర్చుకొమ్మంటారని ఆయన అన్నారు. సినిమా జ్ఞానం, ప్రపంచజ్ఞానం ఉన్న ప్రకాశ్ రాజ్ కే నా మద్దతు అంటూ మరోసారి స్పష్టం చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!