HomeTelugu Trendingకరెన్సీ పై వారి ఫొటోలు కూడా చూడాలని ఉంది

కరెన్సీ పై వారి ఫొటోలు కూడా చూడాలని ఉంది

1 22

జనసేన నేత, నటుడు నాగబాబు గాడ్సే గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఇండియన్ కరెన్సీ నోట్ల మీద సుభాష్ చంద్ర బోస్, అంబేద్కర్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, లాల్ బహదూర్ , పీవీ నరసింహారావు, అబ్దుల్ కలాం, సావర్కార్, వాజ్‌పేయి లాంటి మహానుభావుల చిత్రాలను కూడా చూడాలని ఉంది. ఎందుకంటే స్వతంత్ర భారత ఆవిర్భావానికి కృషి చేసిన మహానుభావులని జనము మర్చిపోకూడదని ఒక ఆశ’ అని నాగబాబు ట్వీట్ చేశాడు.

‘గాంధీ గారు బతికి ఉంటే ఆయన కూడా తనతో పాటు దేశానికి సేవ చేసిన దేశభక్తులని గౌరవించమని తప్పకుండా చెప్పేవారు. దేశం కోసం జీవితాల్ని త్యాగం చేసిన మహానుభావుల పేర్లు తప్ప మొహాలు గుర్తు రావడం లేదు. భావితరాలకు కరెన్సీ నోట్లపై వారి ముఖ పరిచయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది’ అని నాగబాబు అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!