నాగబాబు ట్వీట్లుపై పవన్‌ కల్యాణ్‌ స్పందన..


మెగా బ్రదర్, నటుడు, జనసేన నేత నాగబాబు గాడ్సే పై చేసిన ట్వీట్లు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. నాథూరామ్ గాడ్సేను దేశభక్తుడిగా పోల్చడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడి ఏకంగా పోలీసు కేసులు దాకా కూడా వెళ్ళింది. అయితే ఇంత జరుగుతున్నా ఈ విషయం మీద ఇప్పటిదాకా పవన్ స్పందించలేదు. ఇదే విషయాన్ని చాలా మంది ప్రస్తవిస్తుండడంతో తాజాగా ఈ విషయంపై పవన్ కల్యాణ్‌ స్పందించారు. పార్టీ రాజకీయ వ్యవహారాల సభ్యుడు నాగబాబు సోషల్ మీడియాలో చేసిన పోస్టులు ఆయన వ్యక్తిగతమని ఆయన ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఇక వాటితో పార్టీకి ఎటువంటి సంబందం లేదని, పార్టీ అభిమానులు, జన సైనికుల అభిప్రాయాలు పార్టీకి సంబంధంలేనివని అన్నారు. ఇక జనసేన ఏ అభిప్రాయం వ్యక్తం చేసిన అధికారిక పత్రం ద్వారా తెలియజేస్తామని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నార్. పార్టీ నిర్ణయం ఏదైనా అధికారికంగా ప్రకటిస్తామని పవన్ వెల్లడించారు.