HomeTelugu Trendingనాగార్జున్‌ యాక్షన్‌ షురూ

నాగార్జున్‌ యాక్షన్‌ షురూ

Nagarjuna and praveen satta

హీరో నాగార్జున ప్రవీణ్‌ సత్తారు డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నారాయణ దాస్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌రావు, శరత్‌ మరార్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. హైఓల్టేజ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా.. ఇప్పటికే గోవాలో తొలి షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. ఇప్పుడీ చిత్ర రెండో షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఆగస్టు 4నుంచి ఈ చిత్రీకరణ మొదలు కానున్నట్లు చిత్ర బృందం సోమవారం ప్రకటించింది. భారత్‌లోని ప్రధాన నగరాలతో పాటు విదేశాల్లోనూ కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో నాగ్‌ మాజీ ‘రా’ అధికారిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. కాజల్‌ ఓ యాక్షన్‌ ప్రాధాన్య పాత్రలో నటిస్తోంది. గుల్‌ పనాంగ్‌, అనైకా సురేంద్రన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాబిన్‌ సుబ్బు, నభా మాస్టర్‌ యాక్షన్‌ డైరెక్టర్‌లుగా పని చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu