నాగ్‌ ‘వైల్డ్ డాగ్’ పిక్‌ వైరల్‌


టాలీవుడ్‌ హీరో అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘వైల్డ్ డాగ్’. అహిషోర్ సాల్మోన్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా వాస్తవ సంఘటనలను ఆధారంగా తెరక్కెకుతుంది. ఇప్పటికే సగాన్నికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడి ఇటీవలే తిరిగి ప్రారంభించారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ ప్రధాన తారాగణంతో హిమాచల్ ప్రదేశ్ లోని మనాలి ప్రాంతంలో జరుగుతోంది. తాజాగా ‘వైల్డ్ డాగ్’ టీమ్ తో నాగ్‌ హిమాలయాల్లో సంచరిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

”హిమాలయాలలో తన బృందంతో వైల్డ్ డాగ్ !! లవింగ్ ఫ్రీడమ్.. లవింగ్ నేచర్” అని ట్వీట్‌ చేశాడు. నాగ్ షేర్ చేసిన ఈ ఫోటోలలో ‘వైల్డ్ డాగ్’ టీమ్ చేతిలో గన్స్‌ కనిపిస్తున్నారు. నాగార్జునతో పాటు బాలీవుడ్ బ్యూటీ సయామి ఖేర్ – ‘బిగ్ బాస్’ ఫేమ్ అలీ రెజా – స్టాంటప్ కమెడియన్ మయాంక్ ప్రకాష్ కనిపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన నాగ్ ‘వైల్డ్ డాగ్’ ఫస్ట్ లుక్ విశేషంగా ఆకట్టుకుంది. బాలీవుడ్ భామ దియా మీర్జా హీరోయిన్ గా నటిస్తోంది. హిమాలయాల్లో జరిగే 21 రోజుల షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

CLICK HERE!! For the aha Latest Updates