‘మన్మథుడు’ సీక్వెల్‌ ముహూర్తం ఖరారు

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీస్‌లో సీక్వెల్స్ హవా నడుస్తోంది. చాలా మంది హీరోలు కొత్త కథలతో రిస్క్ చేయడం ఎందుకనో.. ఒకప్పటి వాళ్ల పాత సూపర్ హిట్ సినిమాలకు సీక్వెల్స్ తీస్తున్నారు. ఆల్రెడీ నాగార్జున..’సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రానికి సీక్వెల్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాలో నాగార్జున, నాగ చైతన్య తాత మనవళ్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు నాగ్ కెరీర్‌లోనే కామెడీ క్లాసిక్‌గా నిలిచిన ‘మన్మథుడు’ సినిమాకు సీక్వెల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. విజయ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు త్రివిక్రమ్ మాటలు హైలెట్‌గా నిలిచాయి. తాజాగా తెరకెక్కబోతున్న ఈ సినిమాను రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేయనున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తైయిన సినిమాను ఈ నెల 25న పూజా కార్యక్రమాలతో సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు. ఫస్ట్ షెడ్యూల్‌ను 15 రోజుల పాటు యూరప్‌లో పిక్చరైజ్ చేయనున్నారు. ఈ సినిమాలో నాగార్జున సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. మొత్తానికి అప్పట్లో త్రివిక్ర‌మ్ పెన్ ప‌వ‌ర్ ఈ సినిమా సక్సెస్‌లో కీ రోల్ పోషించింది. మళ్లీ త్రివిక్రమ్ స్థాయి పెన్ పవర్‌ను రాహుల్ రవీంద్రన్ రిపీట్ చేస్తాడా లేదా అనేది చూడాలి.