HomeTelugu Newsఫ్యామిలీ మెంబర్స్‌ని భయపెడుతున్న సితార.. వీడియో వైరల్‌

ఫ్యామిలీ మెంబర్స్‌ని భయపెడుతున్న సితార.. వీడియో వైరల్‌

15
సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత తరచూ.. తన కుటుంబం గురించి ఏదో ఒక వీడియను సోషల్‌ మీడియాలో పొస్ట్‌ చేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె తన కూతురు సితారకు సంబంధించిన ఓ వీడియోను షేర్‌ చేసింది. వార్నర్ బ్రదర్స్ సంస్థ నిర్మాణంలో వచ్చిన ‘కంజ్యూరింగ్’ చిత్రాలు ప్రేక్షకులను ఎంతగా అలరించాయో తెలిసిందే. భయానికి చిరునామాగా నిలిచిన ‘కంజ్యూరింగ్’ సినిమాలు ఇప్పటి వరకు 4 వచ్చాయి. ఈ సిరీస్ లో వచ్చిన ప్రతి సినిమా ఒకదానికి మించి ఒకటి భయపెడుతూ వచ్చాయి. ఇవన్నీ తెలుగులో కూడా విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ‘కంజ్యూరింగ్’ అంటే దెయ్యం లేదా మంత్రాలు చేసే విద్య అని అర్థం. ఇప్పుడు సితార కూడా ‘కంజ్యూరింగ్’గా మారిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా నమ్రత వెల్లడించింది. కాకపోతే సితార సినిమాల్లో భయపెట్టకుండా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్‌ని భయపెడుతోంది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్ చేసిన నమ్రత ”ఇంట్లో కంజ్యూరింగ్ ఉంది. అది మా లిటిల్ బ్రాట్” అని క్యాప్షన్ పెట్టింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu