HomeTelugu Trendingత్వరలోనే బాలయ్య సినిమా షూటింగ్‌

త్వరలోనే బాలయ్య సినిమా షూటింగ్‌

Nandamuri balakrishna gets

లయన్ బాలయ్య 106 వ సినిమాకోసం అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో బాలయ్య 3 విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కొన్నిరోజులుగా ఈ సినిమాకు సంబందించిన టైటిల్ పై రకరకాల వార్తలు వస్తున్నాయి. గతంలో ‘మోనార్క్’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు చెప్పారు. ఆతర్వాత ‘సూపర్ మ్యాన్’ అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. తాజాగా మరో టైటిల్ బయటకు వచ్చింది. ‘టార్చ్ బేరర్’ అనే టైటిల్ ఖాయమంటున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవిందసమేత సినిమాలోని డైలాగ్ ఆధారంగా ఈ సినిమాకు ‘టార్చ్ బేరర్’ అనే టైటిల్ బాగుంటుందని చిత్రయూనిట్ భావిస్తున్నారట. త్వరలో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కాబోతుంది.ఇప్పటికే ఈ సినిమా కోసం భారీ సెట్ వేసారు. అక్కడే షూటింగ్ చేస్తాడని తెలుస్తోంది. బాలయ్య కూడా షూటింగ్‌లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాడట. కాబోతున్నట్లు తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu