HomeTelugu Trendingముస్లిమ్ సోదరులకు సెలబ్రెటీల శుభాకాంక్షలు..

ముస్లిమ్ సోదరులకు సెలబ్రెటీల శుభాకాంక్షలు..

5 24టాలీవుడ్‌ సెలబ్రెటీలు ప్రముఖులు ముస్లిమ్ సోదరులకు రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఆదివారంతో రంజాన్ నెల ఉపవాస దీక్షలు ముగయడంతో పవ్వాల్ నెల మొదటి రోజున ఈద్ జరుపుకోవడం ఆచారంగా వస్తోంది. ఐతే… సౌదీ అరేబియా, దుబాయ్, కువైట్ తదితర గల్ఫ్ దేశాల్లో నిన్నే పండుగ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా భారత్ సహా చాలా దేశాల్లో ఈ వేడుకలు ఇవాళ జరుగుతున్నాయి. ఇప్పటికే ముస్లిమ్ సోదరులకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. తాజాగా నందమూరి నట సింహం.. రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంజాన్ పండగ అనేది ప్రేమ, త్యాగాలకు ప్రతీక. లాక్‌డౌన్ వంటి కఠిన సమయంలో కూడా ఎంతో మనో ధైర్యంతో ఉంటూ కఠోర ఉపవాస దీక్షలు చేశారు. వారి ప్రార్ధనలు ఫలించి కరోనా మహామ్మారి త్వరలో అంతం కావాలని కోరుకుంటునాన్నారు. అంతేకాదు అందరు కూడా తమ తమ ఇళ్లలోనే ఉండి రంజాన్ ప్రార్థనలు చేసుకోవాలని పిలుపునిచ్చారు. అంతేకాదు సమస్త మానవాళి బాగుండేలా ఈద్ అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలని వేడుకుంటున్నట్టు తెలిపారు.

అటు బాలకృష్ణతో పాటు చిరంజీవి, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్ వంటి పలువురు సినీ సెలబ్రిటీలు కూడా ముస్లిమ్ సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!