HomeTelugu Newsరాజకీయాలపై కల్యాణ్‌ రామ్‌ ఏమన్నాడు?

రాజకీయాలపై కల్యాణ్‌ రామ్‌ ఏమన్నాడు?

11
నందమూరి క‌ళ్యాణ్ రామ్ మాత్రం మొదటి నుంచీ రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటూ వ‌స్తున్నాడు. కానీ ఇప్పుడు దీనిపై ఆయ‌న ద‌గ్గ‌రికి కూడా చ‌ర్చ వ‌చ్చింది. ప్ర‌స్తుతం 118 సినిమా ప్ర‌మోష‌న్ లో భాగంగా ఇప్పుడు ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్యలు చేసాడు క‌ళ్యాణ్ రామ్. నంద‌మూరి కుటుంబాన్ని రాజ‌కీయాల నుంచి దూరంగా చూడ‌లేం.. ఎందుకంటే అక్క‌డ న‌టుల‌తో పాటు రాజ‌కీయ నాయ‌కులు కూడా ఉన్నారు. లెజెండ్ సినిమాలో బాల‌య్య చెప్పిన‌ట్లు రాష్ట్ర రాజ‌కీయం పుట్టిందే వాళ్ళింట్లో. అలాంటిది అక్క‌డి వాళ్ల‌కు పాలిటిక్స్ అనేవి కొత్త కాదు.

మీరు రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నారా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మీ పాత్ర ఏంటి అనే ప్ర‌శ్న క‌ళ్యాణ్ రామ్ ముందుకు వ‌చ్చింది. దీనికి ఆయ‌న కూడా ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధాన‌మే చెప్పాడు. నాన్నగారి రాజకీయ వారసత్వం తీసుకోవడానికి చాలా టైమ్ ఉంది. ముందు సినిమా ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కుకోవాలి క‌దా.. రెండు మూడు హిట్లు ప‌డాలి.. ఆ త‌ర్వాతే రాజ‌కీయాలు అంటూ స‌మాధానం చెప్పాడు క‌ళ్యాణ్ రామ్. ఇక రాజకీయాల్లో ప్రచారం చేయాలంటే ముందు మ‌న‌కు వాటి గురించి తెలిసుండాలి క‌దా.. దాంతో ఇప్పుడు కాదులే అనేసాడు ఈ హీరో. కానీ క‌చ్చితంగా ఇప్పుడు కాక‌పోయినా త‌ర్వాతైనా వ‌స్తాన‌ని క్లారిటీ ఇచ్చాడు ఈ హీరో. కానీ ఇప్పుడు రాబోయే ఎన్నిక‌ల్లో మాత్రం ఈయ‌న నుంచి టీడీపీకి ఎలాంటి స‌పోర్ట్ ఉండ‌ద‌ని తేల్చేశాడు క‌ళ్యాణ్ రామ్.

Recent Articles English

Gallery

Recent Articles Telugu