మెగా మేనల్లుడి కోసం వస్తున్న నేచురల్‌ స్టార్‌

మెగా మేనల్లుడు హీరో అల్లు శిరీష్‌ కోసం హీరో నాని అతిథిగా రాబోతున్నారు. శిరీష్‌ నటించిన సినిమా ‘ఏబీసీడీ’. ‘అమెరికన్‌ బార్న్‌ కన్‌ఫ్యూజ్డ్‌ దేశీ’ అన్నది ఉపశీర్షిక. రుక్సార్‌ హీరోయిన్‌. సంజీవ్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. నాగబాబు, కోటా శ్రీనివాసరావు, శుభలేఖ సుధాకర్‌, రాజా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం మే 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మలయాళ సినిమాకు తెలుగు రీమేక్‌గా దీన్ని తెరకెక్కించారు. 2017 ‘ఒక్క క్షణం’ తర్వాత శిరీష్‌ నటించిన సినిమా ఇది.

ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకకు నాని హాజరు కాబోతున్నారట. ఈ విషయాన్ని శిరీష్‌ ట్విటర్‌ వేదికగా తెలుపుతూ.. అతిథిగా రావడానికి ఒప్పుకున్న నేచురల్‌ స్టార్‌కు ధన్యవాదాలు చెప్పారు. మే 13న సాయంత్రం 7 గంటలకు జేఆర్సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఈ వేడుక ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు.

CLICK HERE!! For the aha Latest Updates