చెర్రీ సెంటిమెంట్ ఫాలో అవుతున్న మహేష్!

సూపర్ స్టార్ మహేష్ బాబు బ్యాక్ టు బ్యాక్ రెండు ఫ్లాప్స్ రావడంతో బాగా వెనుకపడ్డాడు. స్పైడర్ కి ఎవ్వరూ ఊహించని స్థాయిలో బిజినెస్ జరిగింది. కానీ మహేష్-మురుగ దాస్ ల పై పెట్టుకున్న భారీ అంచనాలను మాత్రం మ్యాచ్ చెయ్యలేకపోయింది ఈ సినిమా రిసల్ట్. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది రకుల్ ప్రీత్ సింగ్. అయితే ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో భరత్ అను నేను సినిమా చేస్తున్న మహేష్ ఆ తర్వాత మాత్రం వంశి పైడిపల్లి దర్శకత్వంలో తన 25 వ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించబోతున్న ఈ సినిమాకి ఆల్రెడీ లొకేషన్స్ ఫైనలైజేషన్,మ్యూజిక్ సిట్టింగ్స్ వంటి ప్రీ ప్రొడక్షన్ వర్క్ పక్కాగా జరుగుతుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ని కన్సిడర్ చేస్తున్నారు. ఈ ఛాయస్ చాలా మంది మహేష్ ఫాన్స్ కి నచ్చడంలేదు. దానికి కారణం ఈ సినిమా సరిగా ఆడకపోవడమే. కానీ టీమ్ మాత్రం రకుల్ ని ఫైనల్ చెయ్యాలని గట్టిగా డిసైడ్ అయ్యారు. మహేష్ కూడా ఈ నిర్ణయానికి ఓ.కె అన్నాడు. ఎందుకంటే గతంలో కూడా రామ్ చరణ్ కెరీర్ కి చాలా కీలకమయిన బ్రూస్ లీ సినిమాలో కూడా రకుల్ హీరోయిన్.

ఆ సినిమా ఫెయిల్ అయింది,కానీ చెర్రీ,సురేందర్ రెడ్డి కలిసి ఆమెని ధ్రువ సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. సో,ఒకసారి ఫెయిల్ అయిన సినిమాలో హీరోయిన్ ని మళ్ళీ ఇంకో సినిమాకి తీసుకోవడం అనే సెంటిమెంట్ కిమహేష్ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడు. కథని,డైరెక్టర్ ని నమ్మి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం కోసం రామ్ చరణ్ ని ఫాలో అయిపోతున్నాడు. అన్నట్టు ఈ సినిమా చాలా వరకు అతడు తరహాలో కుటుంబ నేపధ్యం లో నడుస్తుందట.