నాని రిస్క్ చేస్తున్నాడా..?

వరుస హిట్స్ తో దూసుకుపోతున్న యంగ్ హీరో నాని నటించిన ‘నిన్ను కోరి’ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా కథ మాత్రం భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఓ హిందీ సినిమా లైన్ తీసుకున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. ప్రేమించిన అమ్మాయికి వేరే వ్యక్తితో పెళ్లి జరగడం, ఆ విషయం తెలుసుకున్న ఆమె భర్త.. భార్యను త్యాగం చేయడం ఇటువంటి కాన్సెప్ట్ తో చాలా తెలుగు సినిమాలు వచ్చాయి. అయితే ప్రేమించిన అమ్మాయికి పెళ్లయిపోయినా.. ఆమె ఉన్న చోటుకి వెళ్ళి తన ప్రేమ గొప్పదని చెప్పి ఆమెను భర్త నుండి తెచ్చుకునే పాత్ర నాని చేస్తున్నట్లుగా సమాచారం.
అయితే ఇలాంటి యాంటీ సెంటిమెంట్ ఉన్న కథతో నాని సినిమా చేస్తున్నాడా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఇది నిజమే అంటూ సినిమా లైన్ ఇదే అంటూ కొందరు కన్ఫర్మ్ గా చెబుతున్నారు. ఎలాంటి పాత్రలో అయినా.. ఒదిగిపోయి నటించే నాని ఈ పాత్రలో సెంటిమెంట్స్, లాజిక్స్ మిస్ కాకుండా ఎలా నటిస్తాడా..? అనే విషయం ఆసక్తికరంగా మారింది.  ఈ చిత్రాన్ని జూన్ 23న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో నాని సరసన నివేదా థామస్ జంటగా కనిపించనుంది. ఆది పినిశెట్టి మరో ముఖ్య పాత్రలో 
కనిపించనున్నాడు.