మరో బాణంతో రాబోతున్నాడు!

బాణం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయిన నటుడు నారా రోహిత్. కమర్షియల్ గా సినిమా వర్కవుట్ కాకపోయినా.. విమర్శకుల ప్రశంసలను అందుకుంది. దర్శకులు కథలను రాసుకునే తీరు మారిందని ఆ సినిమాతో నిరూపించాడు దర్శకుడు చైతన్య దంతులూరి. ఎమోషన్స్ మీద సినిమాను నడిపించాడు. హీరోగా నారా రోహిత్ కు ఆ సినిమా ప్లస్ అయింది. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుందని తెలుస్తోంది. బాణం సినిమా తరువాత చైతన్య ‘బసంతి’ అనే సినిమాను చేశాడు. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో చైతన్యకు అవకాశాలు లేకుండాపోయాయి.
చాలా రోజులు గ్యాప్ తీసుకొని కథను సిద్ధం చేసి నారా రోహిత్ కు వినిపించాడట ఈ దర్శకుడు. అది రోహిత్ కి నచ్చడం.. సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయి. త్వరలోనే ఈ కాంబినేషన్ పట్టాలెక్కబోతోంది. రోహిత్ ప్రస్తుతం పండగలా దిగి వచ్చాడు, కథలో రాజకుమారి వంటి సినిమాల్లో నటిస్తున్నాడు. వీటి తరువాత చైతన్య, రోహిత్ ల సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది.