HomeTelugu Trendingవినోదభరితంగా 'నారాయణ అండ్‌ కో' టీజర్‌

వినోదభరితంగా ‘నారాయణ అండ్‌ కో’ టీజర్‌

Narayana Co

చిన్న పాపిశెట్టి దర్శకత్వంలో సుధాకర్ కోమాకుల హీరోగా నటిస్తున్న చిత్రం ‘నారాయణ అండ్ కో’. పాపిశెట్టి ఫిల్మ్ ప్రొడక్షన్స్ సుఖ మీడియా బ్యానర్ లపై పాపిశెట్టి బ్రదర్స్ తో కలిసి సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ ఈ రోజు విడుదలైంది. ఈ టీజర్‌ మంచి కామెడీ కంటెంట్‌తో అలరిస్తుంది.

నారాయణ అండ్ కో అంటే రిచ్చో రిచ్చో ఫ్యామిలీ అంటే సాగే పాటతో టీజర్‌ నడుస్తుంది. ఈ టీజర్‌లోని డైలాగ్స్‌ అన్నీ అద్యంతం ప్రేక్షకులను నవ్వించేలా ఉన్నాయి. షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతుంది. సురేష్ బొబ్బిలి డా. జోస్యభట్ల నాగ వంశీ త్రయం సంగీతం అందిస్తున్నారు. రవితేజ జి ఈ చిత్రానికి కథను అందించగా రాజీవ్ కె డైలాగ్స్ ఇచ్చారు. శ్రీనివాస్ గొర్రిపూడి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

సుధాకర్ కోమాకుల, దేవి ప్రసాద్, ఆమని, జై కృష్ణ, యామిని బండారు, సప్తగిరి, అలీ రెజా, రాగిణి, అనంత్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. చాలా రోజుల తర్వాత సుధాకర్ కోమాకుల హీరోగా వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకోనుందో తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu