HomeTelugu Trendingఅల్లరి నరేశ్‌ కొత్త సినిమా ప్రకటన

అల్లరి నరేశ్‌ కొత్త సినిమా ప్రకటన

Naresh62 Announcementటాలీవుడ్‌ హీరో అల్లరి నరేశ్ పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్భంగా కొత్త సినిమాపై అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు ఓ ఆసక్తికర వీడియోను రిలీజ్ చేశారు. ఈ సినిమాను.. దర్శకుడు సుబ్బు మంగదేవి తెరకెక్కిస్తున్నారు. ‘ఎన్62’ అనే వర్కింగ్ టైటిల్‌తో వస్తున్న ఈ మూవీకి సంబంధించిన వీడియోలో నరేశ్‌కు దర్శకుడు సుబ్బు మంగదేవి కథ వివరిస్తూ కనిపించారు. బార్‌‌లో కూర్చుని చెబుతున్నట్లుగా చూపించారు.

‘మూర్ఖత్వం బార్డర్ దాటిన ఒకడి జీవిత కథ’ ఈ సినిమా అని డైరెక్టర్ చెప్పారు. నిర్మాత సహా టెక్నీషియన్స్ అందరూ అక్కడే ఉన్నట్లు, వారికీ అక్కడే కథ వినిపించినట్లు ఆసక్తికరంగా వీడియో రూపొందించారు. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకి సంగీతం అందించనున్నారు. ఇక హీరోయిన్, ఇతర నటీనటుల గురించిన సమాచారం త్వరలో వెల్లడి కానుంది.

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

మెగాస్టార్‌ చిరంజీవి భోళాశంకర్‌ టీజర్‌

రామ్‌ గోపాల్‌ వర్మ వివాదస్పద చిత్రం వ్యూహం టీజర్‌

సామజవరగమ మూవీ ట్రైలర్‌

రుద్రంగి మూవీ ట్రైలర్‌

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu