అక్కతో నేచురల్‌ స్టార్‌..


టాలీవుడ్‌ యంగ్‌ హీరో నేచురల్ స్టార్ నాని.. తాజాగా తన అక్క దీప్తితో ఉన్న ఓ ఫొటో బయటికి వచ్చింది. అది ఇప్పటిది కాదు.. నాని సినిమాల్లోకి రాకముందు.. ఆయన హీరో కాకముందు ఫొటో. అప్పట్లో చాలా సన్నగా ఉన్నాడు నాని.

శ్రీనువైట్లతో ఢీ.. రాఘవేంద్రరావుతో అల్లరి బుల్లోడు.. బాపుతో రాధాగోపాలం లాంటి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసాడు నాని. ఆ తర్వాత ఇంద్రగంటి డైరెక్షన్‌లో వచ్చిన అష్టా చమ్మాతో హీరో అయ్యాడు. ఆ వెంటనే కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా కూడా మళ్లీ నిలబడి ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు నాని. ఈ ప్రయాణంలో తన అక్క దీప్తి పాత్ర కూడా చాలా ఉందని చాలా సార్లు చెప్పాడు ఈయన. చిన్నపుడు చాలా అల్లరి చేసే తమ్ముడ్నే అంటూ చెప్పుకొచ్చాడు నాని. ఈ ఫొటోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది.