HomeTelugu Trending'కన్నప్ప' షూటింగ్ తొలి షెడ్యూల్ పూర్తి

‘కన్నప్ప’ షూటింగ్ తొలి షెడ్యూల్ పూర్తి

Kannappa first Scheduleమంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం కన్నప్ప. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మంచు విష్ణుతో పాటు ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్ వంటి దిగ్గజ నటులు కనిపించనున్నారు.

కన్నప్ప మూవీ షూటింగ్ న్యూజిలాండ్‌లో జరుగుతున్న సంగతి తెలిసిందే. అక్కడ తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తిచేసుకుని ఇండియాకు తిరిగి వస్తున్నామంటూ మోహన్‌బాబు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.

మంచు విష్ణు కథానాయకుడిగా నిర్మిస్తున్న కన్నప్ప చిత్రం మొదటి షెడ్యూల్‌ను న్యూజిలాండ్‌లో దిగ్విజయంగా ఆ పరమేశ్వరుడు, షిర్డీ సాయినాథుని ఆశీస్సులతో పూర్తి చేసుకున్నట్లు మోహన్‌బాబు తెలిపారు.

ఇందులో హాలీవుడ్, భారత్‌కు చెందిన అతిరథ మహారథులైన నటీనటులతో థాయ్‌లాండ్, న్యూజిలాండ్ సాంకేతిక నిపుణులతో తొలి షెడ్యూల్ పూర్తిచేశామని అన్నారు. 90 రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్ న్యూజిలాండ్‌లోని అద్భుతమైన లొకేషన్స్‌లో చిత్రీకరించినట్లు తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu