న‌వీన్ చంద్ర హీరోగా వేణుమూవీస్ సంస్థ కొత్త చిత్రం ప్రారంభం

న‌వీన్ చంద్ర హీరోగా వేణుమూవీస్ సంస్థ కొత్త చిత్రం ప్రారంభం

రెండు ద‌శాబ్దాల పాటు పంపిణీ రంగంలో మూడు వంద‌ల‌కు పైగా చిత్రాల‌ను డిస్ట్రిబ్యూట్ చేసిన వేణుమూవీస్ నిర్మాణ రంగంలోకి ప్ర‌వేశించింది. పసుపులేటి శ్రీనివాస‌రావు స‌మ‌ర్ప‌ణ‌లో న‌వీన్ చంద్ర హీరోగా జి.గోపి ద‌ర్శ‌క‌త్వంలో వేణుమాధ‌వ్ నిర్మాత‌గా రూపొందుతున్న కొత్త చిత్రం శ‌నివారం హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది. ముహుర్త‌పు స‌న్నివేశానికి టి.వి.న‌ర‌సింహారెడ్డి క్లాప్ కొట్ట‌గాక‌రంటం రాంబాబు కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సంద‌ర్భంగా….

చిత్ర ద‌ర్శ‌క నిర్మాత‌లు మాట్లాడుతూ న‌వీన్ చంద్ర‌ఆర్తి చిక్క‌ర హీరో హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఇది రొమాంటిక్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌. క‌థ ప‌రంగా ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమాను అత్యున్న‌త సాంకేతిక విలువ‌ల‌తో నిర్మిస్తాం“ అన్నారు.

ఈ చిత్రానికి కెమెరాః వాసుసంగీతం: కార్తీక్‌ఆర్ట్ డైరెక్ట‌ర్ః హ‌రిఎగ్జిక్యూటివ్ నిర్మాతః వి.శ్రీనివాస్‌స‌హా నిర్మాతః వి.కావేరినిర్మాతః ప‌సుపులేటి వేణుమాధ‌వ్‌ర‌చ‌న‌ద‌ర్శ‌క‌త్వంః జి.గోపి.
CLICK HERE!! For the aha Latest Updates