సమంత, నయన్‌ల మధ్య పోటీ.!

టాలీవుడ్ లో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు తక్కువగా వస్తుంటాయి. కోలీవుడ్ లో అలా కాదు. నయనతార హీరోలతో కలిసి సినిమాలు చేస్తూనే.. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది. అలా చేస్తున్న సినిమాలు హిట్ కావడంతో.. ఆమెకు లేడీ సూపర్ స్టార్ అని తమిళ తంబీలు పిలుచుకుంటున్నారు. మరోవైపు సమంత హీరోయిన్ గా తమిళనాడులో దూసుకుపోతున్నది.

లేడీ సూపర్ స్టార్ డ్యూయెల్ రోల్ చేసిన ఐరా సినిమా మార్చి 28 న విడుదల కాబోతున్నది. ఇందులో నయనతార నల్లగా ఉండే అమ్మాయిగా, తెల్లగా గ్లామర్ గా కనిపించే అమ్మాయిగా ఉంటుంది. ఈ రెండు పాత్రల్లో నయనతార జీవించిందని వార్తలు వస్తున్నాయి. సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

మరోవైపు సమంత హీరోయిన్ గా చేసిన సూపర్ డీలక్స్ సినిమా మార్చి 29 న రిలీజ్ కాబోతున్నది. ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయింది. సమంత తో పాటు ఇందులో విజయ్ సేతుపతి, రమ్యకృష్ణలు నటిస్తున్నారు. మరి ఈ ఇద్దరిలో విజేత ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.