మహేష్ తో నయన్ వర్కవుట్ అవుతుందా..?

మురుగదాస్ దర్శకత్వంలో ప్రస్తుతం మహేష్ బాబు ‘స్పైడర్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది. క్లైమాక్స్ కు సంబంధించిన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఒక ముఖ్యమైన గెస్ట్ రోల్ ఉందట. ఆ పాత్రలో నయనతార కనిపిస్తే బావుంటుందని మురుగదాస్ ఆలోచిస్తున్నారు. ఈ మేరకు ఆమెతో సంప్రదింపులు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

గతంలో నయన్, మురుగదాస్ రూపొందించిన ‘గజిని’ సినిమాలో నటించింది. ఆ సినిమా నయన్ కెరీర్ కు ఎంతగానో హెల్ప్ అయింది. కాబట్టి మురుగదాస్ అడిగితే నయన్ కాదనదని నమ్మకం. నయన్ గెస్ట్ రోల్ లో కనిపించడం అది కూడా మహేష్ బాబు సినిమాలో అంటే ఈ కాంబినేషన్ వర్కవుట్ అవుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఇక్కడ ఉన్నది మురుగదాస్ కాబట్టి ఛాన్సులు కూడా లేకపోలేవు.