విఘ్నేష్‌తో నయనతార నిశ్చితార్థం!

కొంత కాలంగా స్టార్ జంట నయనతార, విఘ్నేష్ ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతుంటాయి. వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం కూడా జరిగింది. తాజాగా నయన్ ప్రియుడు విఘ్నేష్ సోషల్ మీడియాలో చేసిన పోస్టు ఆసక్తికరంగా ఉంది. నయనతార చేయి అతడి గుండెలమీద ఉండగా ఆమె వేలికి ఉంగరం ఉంది. దీంతో ఈ ప్రేమజంట ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఈ ఫొటో తెగ వైరల్ అవుతోంది. త్వరలోనే వీరిద్దరు పెళ్లిచేసుకోబోతున్నట్లు అర్ధమవుతోంది అంటున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates