నయనతార ప్రియుడి బర్త్‌డే సెలబ్రేషన్స్‌


నయనతార తన ప్రియుడు విఘ్నేష్ శివన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించింది. అత్యంత సన్నిహితులు, పలువురు సినీ ప్రముఖులు సమక్షంలో ఘనంగా నిర్వహించిన ఈ వేడుకలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నయనతార తన ప్రియుడి కోసం కేక్‌ను బంగారు వర్ణంలో ప్రత్యేకంగా తయారు చేయించింది. నయనతార బ్లాక్ డ్రెస్‌లో అందంగా మెరిసిపోతుంది. వీరిద్దరి జంట బాగుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో నయనతార ప్రేమలో పడిందని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. నేనూ రౌడీనే సినిమాషూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ ఏర్పడిందట. అప్పటి నుంచి వీరిద్దరూ కలిసి విహారయాత్రలకు, ఫంక్షన్లకు హాజరవుతున్నారు. నయన్ నా సన్‌షైన్ అంటూ పలుమార్లు ట్విట్టర్‌లో పోస్టులు చేస్తూ వీరిద్దరు క్లోజ్‌గా ఉన్న ఫొటోలను షేర్ చేశాడు విఘ్నేష్. ప్రేమికుల దినోత్సవం రోజు నయన్‌కు శుభాకాంక్షలు చెబుతూ ప్రేమించడం, ప్రేమించబడటం గొప్ప విషయం కాబట్టి ఎప్పుడూ ప్రేమిస్తూ ఉండండి అని పోస్ట్ చేశాడు.