కేసీఆర్ డిక్టేటర్ కాదు: మంచు విష్ణు ట్వీట్స్‌ ట్రెండ్

ఇంటర్మీడియట్ రిజల్ట్ విషయంలో తెలంగాణలో ప్రస్తుతం రచ్చ రచ్చ జరుగుతున్నది. రిజల్ట్ విషయంలో స్పందించిన కేసీఆర్ ఫెయిలైన విద్యార్థులకు ఉచితంగా రివెరిఫికేషన్ ను కల్పించారు. జరిగిన పొరపాటుకు కారణాలు తెలుసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ విషయంలో సినిమావాళ్లు స్పందించడంలేదని వార్తలు వస్తున్నాయి. కేసీఆర్ కు భయపడి స్పందించడం లేదని వస్తున్న వార్తలపై మంచు విష్ణు స్పందించాడు.

సినిమావాళ్లు భయపడటం లేదని, జరిగిన విషయానికి ప్రభుత్వం ఇప్పటికే స్పందించిందని విద్యార్థులకు ఉచితంగా రివెరిఫికేషన్ కల్పించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చిందని మంచి విష్ణు ట్విట్టర్ ద్వారా పేర్కొన్నాడు. విడుదల తప్పిదాల కారణంగా మరణించిన 20 మంది విద్యార్థిని విద్యార్థుల కుటుంబాలకు విష్ణు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ చర్యలపై ప్రభుత్వం స్పందించి ఉండకపోతే అనేక విమర్శలకు తావునిచ్చేదని తానుకూడా బలంగా నమ్ముతున్నానని విష్ణు అన్నారు. కేటీఆర్, కేసీఆర్ లు ప్రజలకు కోసం పనిచేసే రాజకీయ నాయకులని, కేసీఆర్ డిక్టేటర్ కాదని మంచు విష్ణు ట్విట్టర్ ద్వారా పేర్కొన్నాడు. ప్రభుత్వాన్ని విమర్శించడానికి బదులు అసలు ఈ తప్పులు జరగడం వెనుకగల కారణాలను తెలుసుకోవాలని విష్ణు ట్వీట్ చేశారు. మంచు విష్ణు ట్వీట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

CLICK HERE!! For the aha Latest Updates