బన్నీ సినిమాలో నిహారిక!

మెగా డాటర్‌ నిహారిక వెబ్ సిరీస్ ల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత మూడు సినిమాలు చేసింది. కథ .. పాత్రల విషయంలో జాగ్రత్తలు తీసుకున్నా, అవి అంతగా ఆడలేదు. దాంతో ఇక సినిమాలను పక్కన పెట్టేసి, వెబ్ సిరీస్ ల పైనే పూర్తి దృష్టిపెట్టాలని నిహారిక నిర్ణయించుకున్నట్టుగా వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలోనే నిహారికకు బన్నీ సినిమాలో నటించే అవకాశం వచ్చిందట. అయితే ఇది త్రివిక్రమ్ సినిమా కాదు.. సుకుమార్ సినిమాలో. త్రివిక్రమ్ సినిమా తరువాత సుకుమార్ తో కలిసి బన్నీ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రకిగాను నిహారిక అయితే బాగుంటుందని బన్నీతో సుకుమార్ అనడంతో, బన్నీ ఆమెను ఒప్పించాడని అంటున్నారు. నిహారిక పాత్ర ఏమిటనే విషయం త్వరలో తెలిసే అవకాశం వుంది.