HomeTelugu Trendingనిహారిక రిసెప్షన్‌ ఫొటో వైరల్‌

నిహారిక రిసెప్షన్‌ ఫొటో వైరల్‌

niharika reception pics wen
మెగా డాటర్‌ నిహారిక- చైతన్యల రిసెప్షన్ నిన్న హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ నెల 9న రాజస్థాన్ ఉదయపూర్‌లోని ఉదయ్ విలాస్ లో చైతన్య,నిహారికల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మెగా హీరోలంతా ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు. మెగాస్టార్‌ చిరంజీవి, పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌,రామ్‌చరణ్‌ తేజ్, స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, ‌సాయి ధరమ్‌ తేజ్‌, అల్లు ఫ్యామిలీ మొత్తం హాజరైయ్యారు.

శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన రిసెప్షన్ వేడుకలో మెగా కుటుంబ సభ్యులతో పాటుగా పలువురు సినీ ప్రముఖులు పాల్గొని నూతన వధు వరులను ఆశీర్వదించారు. ఇండస్ట్రీ నుంచి పలువరు ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నారు. జేఆర్సీ ప్రాంగణంలో ఈ వేడుకా గ్రాండ్‌గా జరింగింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!