నిహారిక ‘సూర్యకాంతం’ ఫస్ట్‌ లుక్‌

మెగా డాటర్ నిహారిక మరో కొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమౌతున్నారు. ఆమె హీరోయిన్‌గా ‘సూర్యకాంతం’ అనే సినిమా తెరకెక్కుతోంది. బి. ప్రణీత్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వరుణ్‌తేజ్‌ సినిమాను సమర్పిస్తున్నారు. సందీప్‌ ఎర్రంరెడ్డి, రామ్‌ నరేష్‌, సృజన్ ఎర్రబోలు‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మార్క్‌ కె రాబిన్‌ సంగీతం అందిస్తున్నారు.

మంగళవారం నిహారిక పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను రీలీజ్‌ చేశారు. ఇందులో నిహారిక హీరోని ప్రియురాలిగా మురిపిస్తూనే.. మరోవైపు రాక్షసిలా వేధిస్తూ కనిపించారు. విభిన్న కథాంశంతో దీన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పోస్టర్‌ను వరుణ్ ట్విటర్‌లో షేర్‌ చేశారు. తన సోదరి సినిమాను సమర్పిస్తుండటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ‌అందరికీ సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.