స్ట్రీమింగ్‌లో నితిన్‌ ‘భీష్మ’ !


టాలీవుడ్‌ యంగ్‌ హీరో నితిన్ ‘భీష్మ’ సినిమాతో చాలా కాలం తరువాత మంచి హిట్ కొట్టాడు. ఈ సినిమాలో నితిన్‌కు జంటగా రష్మిక మందన్న నటించింది. వెంకీ కుడుములు దర్శకత్వం వహించిన ఈ సినిమా కమర్షియల్ గా మంచి వసూళ్లు సాధించింది. ఫిబ్రవరి 21 న థియేటర్లో సినిమా విడుదల అయ్యింది. సినిమా బాగున్నప్పటికీ మార్చిలో కరోనా కారణంగా సినిమా థియేటర్లు మూత పడ్డాయి. ఎప్పటికి తెరుస్తారో కూడా తెలియని పరిస్థితి.

ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ప్రజలు కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇంట్లో కూర్చున్న జనాలు నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి వాటిల్లో సినిమాలు చూసుకుంటున్నారు. నితిన్ భీష్మ సినిమాను ఈనెల 25 వ తేదీన నెట్ ఫ్లిక్స్, సన్ నెక్స్ట్ లో విడుదల చేయబోతున్నారు. థియేటర్లో మిస్సైన వ్యక్తులు హ్యాపీగా స్ట్రీమింగ్ లో సినిమాలు చూసుకొని ఎంజాయ్ చెయ్యొచ్చు.