నితిన్ మళ్ళీ తప్పు చేస్తున్నాడా..?

భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ‘లై’ చిత్రంతో డిజాస్టర్ ను అందుకున్నాడు నితిన్. అయితే ఈ సినిమా తరువాత భారీ బడ్జెట్ సినిమాలు అంటే భయపడతాడేమో అనుకుంటే ఇప్పుడు మరో ప్రయత్నానికి రెడీ అవుతున్నాడు. ఇటీవల ‘గరుడవేగ’ సినిమా హిట్ అయిన తరువాత దర్శకుడు ప్రవీణ్ సత్తారుతో ఒక సినిమా ఉంటుందని నితిన్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి వేరే హీరోతో ప్రవీణ్ సత్తారుతో ఒక సినిమా చేయాలన్నది ప్లాన్.

అయితే నితిన్ ఆలోచనలకు అనుగుణంగా ప్రవీణ్ సత్తార్ ఈ స్క్రిప్ట్ ను నితిన్ కోసం మార్పులు చేర్పులు చేస్తున్నట్లు ఫిలింనగర్ టాక్. దాదాపు 50 కోట్ల బడ్జెట్ తో ఈసినిమాను తీస్తారని అని అంటున్నారు. ఇప్పటికే భారీ ఫ్లాప్ ను అందుకున్న నితిన్ మళ్ళీ ప్రవీణ్ సత్తారుతో ఇలాంటి
ప్రయత్నం చేయడం అది కూడా సొంత ప్రొడక్షన్ లో అంటే రిస్క్ ఏమో అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.