HomeTelugu Trendingవినాయక చవితికి రానున్న నితిన్‌!

వినాయక చవితికి రానున్న నితిన్‌!

Nithin new movie update
నితిన్‌ హీరోగా ప్రస్తుతం వక్కంతం వంశీ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలసిందే. ఎన్నో బ్లాక్‌బస్టర్‌ సినిమాలకు రైటర్‌గా పనిచేసిన వక్కంతం వంశీ ఐదేళ్ల క్రితం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాతో దర్శకుడిగా మారాడు. కాగా తొలి సినిమానే డిజాస్టర్‌ అయింది. దాంతో మళ్లీ మెగా ఫోన్‌ పట్టడానికి ఏకంగా ఐదేళ్లు సమయం పట్టింది.

గతేడాది షూటింగ్‌ ప్రారంభించిన ఈ సినిమా ప్రస్తుతం తుది దశకు చేరుకుంది. ఇక ఇప్పటికి వరకు ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్‌డేట్‌ కూడా బయటకు రాలేదు. దాంతో అసలు ఈ సినిమా ఉందన్న విషయమే చాలా మంది ప్రేక్షకులు మర్చిపోయారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈ సినిమాను వినాయక చవితి సందర్భంగా రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారట.

అదే దిశగా షూటింగ్‌ను వేగవంతం కూడా చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో నితిన్‌ స్మగ్లర్‌గా కనిపించనున్నట్లు సమాచారం. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రేష్ఠ్ మూవీస్‌ బ్యానర్‌పై నితిన్‌ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో క్రేజీ హీరోయిన్‌ ‘పెళ్ళిసందD’ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాకు హారిస్‌ జయరాజ్‌ సంగీతం అందిస్తున్నాడు.

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu