నితిన్ కొత్త ప్రాజెక్ట్!

కథల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ.. వరుసగా హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంటున్నాడు హీరో నితిన్. రీసెంట్ గా ‘అ ఆ’ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన నితిన్ ప్రస్తుతం హనురాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాతో పాటు త్రివిక్రమ్, పవన్ కల్యాణ్ కలిసి నిర్మిస్తోన్న ఈ సినిమాలో నటించడానికి కూడా నితిన్ అంగీకరించాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

అయితే తాజాగా నితిన్ మరో కొత్త ప్రాజెక్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ విషయాన్ని చిత్రనిర్మాత రాధామోహన్ స్వయంగా చెప్పారు. భారీ బడ్జెట్ లో ఈ సినిమా రూపొందబోతుందని ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయని అన్నారు. ఆగస్ట్ లో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే డైరెక్టర్ ఎవరనే విషయం తెలియాల్సివుంది!