HomeTelugu Trendingప్రభాస్‌కి చెల్లెలుగా నివేదా థామస్‌!

ప్రభాస్‌కి చెల్లెలుగా నివేదా థామస్‌!

Nivetha thomas in prabhas mటాలీవుడ్‌లో నాని ‘జెంటిల్ మెన్’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నివేదా థామస్. ‘నిన్ను కోరి’ ‘జై లవకుశ’ ‘బ్రోచేవారెవరురా’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘వకీల్ సాబ్’ సినిమాలో నివేద కీలక పాత్రలో కనిపించనుంది. ఇక ఈమె నటించిన తాజా చిత్రం ‘వి’ సెప్టెంబర్ 5న ఓటీటీలో విడుదల కానుంది. అయితే ఇప్పుడు తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలో నటించే అవకాశం నివేదా థామస్ దక్కించుకుందని వార్తలు వస్తున్నాయి.

కాగా ప్రభాస్ ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ప్రభాస్ కెరీర్లో 21వ చిత్రంగా రానున్న ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో అశ్వినీ దత్ నిర్మించనున్నారు. పాన్ ఇండియన్ మూవీగా రూపొందనున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్‌ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమాలో ప్రభాస్ చెల్లెలి కూడా పాత్ర కీలకం అని.. దీని కోసం నాగ్ అశ్విన్ నివేదా థామస్ ని సంప్రదించారని వార్తలు వినిపిస్తున్నాయి. ‘కురువు’ ‘జిల్లా’ సినిమాల్లో హీరో చెల్లెలిగా నటించిన నివేదా.. ‘పాపనాశం’ ‘దర్బార్’ చిత్రాల్లో హీరో కూతురిగా నటించింది. హీరోయిన్ గా మాత్రమే కాకుండా.. విలక్షణమైన పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ వస్తున్న నివేదా థామస్.. ప్రభాస్ కి సిస్టర్ గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!